Bandi Sanjay: బండి సంజయ్ ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు

by Prasad Jukanti |

గ్రూప్ 1 అభ్యర్థులు బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Bandi Sanjay: బండి సంజయ్ ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేక బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ గ్రూప్ -1 అభ్యర్థులు బండి సంజయ్ ను కలిశారు. గ్రూప్-1 ఫలితాలపై తాము చేసిన పోరాటాలకు గతంలో మద్దతు తెలిపినందుకు బండి సంజయ్ కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీ ఎప్పుడు నిరుద్యోగుల పక్షం నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్ లో నిరుద్యోగులకు అవసరమైన న్యాయ పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా, ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలను, మార్చి 30 ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు నిన్న రద్దు చేసిన సంగతి తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీకి (TGPSC Group-1) హైకోర్టు ఆదేశించింది.

Next Story