TG: మున్సిపాలిటీలకు నిధులు మంజూరు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా వడ్డీలేని రుణాల కోసం రూ.41.20కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

TG: మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా వడ్డీలేని రుణాల కోసం రూ.41.20కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీటికి సంబంధించి సీడీఎంఏ తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

6 మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు...

ఆరు మున్సిపాలిటీలకు అభివృద్ది పనుల నిమిత్తం మున్సిపల్ శాఖ రూ.90 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున కేటాయించింది. మహాబుబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, గుమ్మడిదల, కోహిర్, ఇస్నాపూర్, మేడ్చల్ జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి.

Next Story