- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఇలాఖాలో కవిత.. ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు
తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka)కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka)కు చేరుకున్నారు. ఆమెకు స్థానిక మహిళలు, జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. సాయంత్రం నిర్వహించబోయే ఎంగిలిపూల బతుకమ్మ వేడుక(Bathukamma Celebration)లో కవిత పాల్గొననున్నారు. ఇప్పటికే చింతమడకలోని శివాలయం, రామాలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే భారత రాష్ట్ర సమితికి ఆమె రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఇలా కుటుంబ పార్టీకి దూరమైన కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామా తర్వాత ఆమె ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కేసీఆర్(KCR) ఇలాఖా అయిన చింతమడక నుంచి ఆహ్వానం రావడం, ఆమె స్వయంగా నేడు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.






