- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NLG: ఘనంగా వనమహోత్సవం
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

X
దిశ, కనగల్లు: వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, పాలక మండలి సభ్యులు చెనగోని నగేష్ గౌడ్, కే.శంకర్ రెడ్డి, రాయల వెంకన్న, నరాల బాబు, కొత్త మాసు ప్రభాకర్, జే.నవీన్, యన్.రాజు, ఆలయ అధికారులు నాగేశ్వరరావు, జినుకుంట్ల చంద్రయ్య, కూసం ఉపేందర్ రెడ్డి, రాజయ్య, యన్. ఆంజనేయులు, అర్చకులు శ్రవణ్ కుమార్ చార్యులు, గాదె ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






