తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన గ్రామసభలు

by Gantepaka Srikanth |
తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన గ్రామసభలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నేటివరకు 16,348 గ్రామ సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా గ్రామసభలు 12,861, వార్డు సభలు 3,487 మొత్తం 16,348 నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రామ సభలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed