- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: ఇకపై అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్స్.. వారికి అవార్డులు: సీతక్క
అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్స్ ఇస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పోషకాహార తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని, అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) పూర్తి స్ధాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీలపై ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. రాబోయే రోజుల్లో అంగన్ వాడీ సెంటర్లకు గ్రేడింగులు (Gradings for Angan Wadi Centers) ఇస్తామని మంచి గ్రేడ్లు సాధించిన సెంటర్లకు, సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకల లాడాలన్నారు. చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదన్నారు. సెంటర్ లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు చేపట్టాలని చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు:
అంగన్ వాడీకి అందే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. బడి బాట తరహాలోనే మీరు గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరు. 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉంది. 586 కేంద్రాల్లో పదిలోపే ఉన్నారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నది. మీరు సీరియస్ గా ఉంటేనే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. అంగన్వాడి సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత మీదేనన్నారు.
మీ వల్ల మేము మాటపటాల్సి వస్తోంది:
కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఈ-టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదు? మీ తప్పిదాల వల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాల్సిందేనన్నారు. పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిని నిలిపి వేసి ఈ టెండర్ విధానాన్ని అవలంభించాలని, కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవాలన్నారు. సామ్, మామ్ చిన్నారులను గుర్తించి రిపోర్ట్ చేయాలన్నారు. మీకు చెడ్డ పేరు వస్తుందని పిల్లల పోషకాహార లోపాన్ని దాచి పెడితే సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. పిల్లల అమ్మకాలు, బాల్యవివాహాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే దత్తలపై దృష్టి సారించాలన్నారు.






