- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు వ్యక్తి గుప్పిట్లో ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రి.. కమీషన్ల కోసమేనా..?
నిత్యం పదుల సంఖ్యలో కేసులు వచ్చే ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో ఓ ప్రైవేటు వ్యక్తి తిష్ట వేశాడు.

దిశ, పేట్ బషీరాబాద్ : నిత్యం పదుల సంఖ్యలో కేసులు వచ్చే ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో ఓ ప్రైవేటు వ్యక్తి తిష్ట వేశాడు. వచ్చిన పెట్స్‌కు చికిత్స చేయడం.. బదులుగా అతని మెడికల్ షాప్‌లో మందులు కొనేలా ప్రిస్క్రిప్షన్ రాయడం వంటి చేస్తున్నాడనే ఆరోపణలు కుత్బుల్లాపూర్ ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిపై వినిపిస్తున్నాయి.
గతంలో పని చేసిన వ్యక్తే..
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్స్‌లో అవుట్‌సోర్సింగ్‌గా పనిచేసిన వ్యక్తి ఈ మధ్యకాలంలో పని మానేశాడు. అనంతరం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకుని ఒక వెటర్నరీ మెడికల్ షాపును, వెటర్నరీ క్లినిక్‌ను ఏర్పాటు చేశాడు. ఇతను ప్రభుత్వ ఆసుపత్రి పనిచేసే సమయాల్లో వెటర్నరీ హాస్పిటల్‌లోనే ఉంటూ అక్కడికి వచ్చే పెట్స్‌కు చికిత్స చేస్తూ ఉంటాడు. దీనికి బదులుగా అక్కడి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ మందులు అతని షాపులో కొనే విధంగా చేసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అక్కడి డాక్టర్, సిబ్బంది సహకరిస్తూ వస్తుండడంతోనే యధేచ్చగా ఆస్పత్రిలో వైద్యం చేస్తూ ఉన్నాడనే విమర్శలు ఉన్నాయి.
కమీషన్ల కోసమే అనుమతి..?
కమీషన్ కోసమే ప్రైవేటు వ్యక్తిని ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో వైద్యం చేయడానికి అనుమతిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రికి ఆనుకుని ప్రైవేటు వెటర్నరీ క్లినిక్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రి మూసివేసిన సమయంలో దానిలో సైతం ట్రీట్మెంట్ అందిస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై ఫోటోలు, వీడియోలతో ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తి వైద్యంపై ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ.. సదరు వ్యక్తికి ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదని, అతనిని ఆస్పత్రి లోపలికి రావద్దని చెప్పడం జరిగిందని చెబుతుంటే డాక్టర్ అనిల్ కుమార్ మాత్రం బ్యాండేజ్ వేయడానికి తానే పిలిపించా, మిగిలిన వైద్యం గురించి నాకు తెలియదని, నేను లేని సమయంలో చేస్తున్నాడేమో అని చెప్పుకొచ్చారు. కాగా వెటర్నరీ సర్జన్ అయినా డాక్టర్ అనిల్ బ్యాండేజ్ వేయలేరా..? డాక్టర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది ఉన్న ఈ ఆసుపత్రిలో బ్యాండేజ్ వేయడం రాని వారు ఉన్నారా..? అనేది ఇక్కడ ప్రశ్న.






