- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Govt GO: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం జీవో.. ఇకపై అలా చేస్తే నేరమే
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ తల్లి విగ్రహన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగి ఆకుపచ్చని చీరలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా (Statue of Telangana mother) ఇవాళ ఆమోదించింది.ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari) తెలుగులో ఉత్వర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల రిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ తల్లి విగ్రహం మన జాతి అస్తిత్వ, ఆ్తమగౌరవల ప్రతీక అని తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం గానీ, వేరే విధంగా చూపించడం గానీ నిషేధింస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ, ఇతర ప్రదేశాలలో గాని ఆన్ లైన్ లో గాని, సామాజిక మాధ్యమాలలో గాని, మాటలు లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరిచడం నేరంగా పరిగణించబడుతుందని జీవోలో పేర్కొంది.






