విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ అధికారులదే బాధ్యత : ఐఎస్‌యూ

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు మరణిస్తున్నారని, వాటన్నీటికి ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులే బాధ్యత వహించాలని ISU జాతీయ అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు.

విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ అధికారులదే బాధ్యత : ఐఎస్‌యూ
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు మరణిస్తున్నారని, వాటన్నీటికి ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులే బాధ్యత వహించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్(ISU) జాతీయ అధ్యక్షుడు పాపని నాగరాజు, తెలంగాణ అధ్యక్షుడు పి.వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల్లో విద్యార్థులు మరణించినా, ఎలాంటి సంఘటన జరిగినా వాటికి ఆ పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహిస్తుందని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులు మరణిస్తే గవర్నంట్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు విద్యార్థుల మరణాలు విపరీతంగా జరుగుతున్నాయని, ముక్కు పచ్చలారని విద్యార్థుల జీవితాలని సాలించడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి రూట్‌ మ్యాప్‌ లేకపోవడం విచారకరం అన్నారు. ఈ మరణాలు పాఠశాలలు, కళాశాలలో, ముఖ్యంగా వివిధ గురుకుల పాఠశాలలో అధిక మొత్తంలో సంభవిస్తున్నాయని ఆవేదన చెందారు. విద్యార్థుల మరణానికి పూర్తిస్థాయిలో శాఖలకు సంబంధించిన అధికారులే నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్‌ సెక్టార్‌లో విద్యార్థుల మరణాలకు కారణం ఆయా యాజమాన్యాలు బాధ్యత వహించినప్పుడు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చనిపోతున్న వీరి మరణాలకు ఆయా శాఖల ఆధిపతుల బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని తేల్చి చెప్పారు.

Next Story