- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt: గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
by Prasad Jukanti |
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: 17 మంది ప్రాణాలు బలిగొన్న హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం (Gulzar House Fire) ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ తో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు ఇవ్వాలని కమిటీకి సూచించారు.
Next Story






