- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ప్రభుత్వం శాఖలను కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ లో కొత్త గా చేరిన మంత్రి మహ్మద్ అజారుద్దీన్ కు (Mohammad Azharuddin) ప్రభుత్వం శాఖలను (portfolio allocation) కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ తో పాటు ఏ మంత్రికి కేటాయించని ఇతర విభాగాలు ఉన్నాయి. వాటిలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను అజారుద్దీన్ కు కేటాయించారు. ఇక గత జూన్ లో మంత్రివర్గలో చేరిన అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ఆయన వద్దనున్న మైనార్టీ శాఖను అజారుద్దీన్‌కు అప్పగించింది.
కాగా గత శుక్రవారం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోం శాఖ కోసం అజారుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ పోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు హోం శాఖకు బదులు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది.






