- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము ఊహించినట్టే సుప్రీం తీర్పు వచ్చింది: షబ్బీర్ అలీ
తాము ఊహించినట్టే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఏ వ్యవస్థకు ఉండే అధికారం ఆ వ్యవస్థకు ఉంటుందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తాము ఊహించినట్టే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఏ వ్యవస్థకు ఉండే అధికారం ఆ వ్యవస్థకు ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు, అసెంబ్లీ ఇవి రెండు స్వతంత్రమైనవి అన్నారు. మీరే అనర్హత వేటు వేయండి అంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను డిస్మస్ చేసిందని చెప్పారు. మేం అనర్హత వేటు వేయలేం కాబట్టి అసెంబ్లీలోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎమ్మెల్యేల పదవీకాలం 5ఏళ్లే కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఎంతో స్టడీ చేసి ఈ తీర్పును ఇచ్చిందన్నారు. పార్టీ ఫిరాయింపులు అనేవి కేసీఆర్ నేర్పించిన విద్యనే అని అన్నారు. ఆయన నేర్పించడంతోనే ఫిరాయింపులు మొదలయ్యాయని అన్నారు. ఎంతో మంది గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న నెంబర్ వన్ కేడీ అన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడే కోర్టులో కేసు వేశారని అన్నారు.






