- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma Special: తెలంగాణ ప్రజలకు గవర్నర్ కీలక పిలుపు
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ఈ సంబరాలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.కె.వి. శర్మ, రాష్ట్ర కార్యదర్శి భవాని, మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ సుష్మ, కో-కన్వీనర్ షాలిని తదితరులు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సంస్కార భారతి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.






