- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్.. కేంద్ర హోంశాఖకు పంపిన గవర్నర్
బీసీ రిజర్వేషన్ల(BC Reservations) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల(BC Reservations) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్(Ordinance) ను పంపగా.. ఆయన న్యాయ సలహా కోసం దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. అయితే ముందుగా అడ్వొకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను హోంశాఖకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారు.
దీంతో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు(Local Body Elections) సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాల్సి ఉంది. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read..
Next Story






