నీతి, న్యాయంతో నియామక ప్రక్రియ జరగాలి.. TGPSCకి గవర్నర్ సూచన

by Gantepaka Srikanth |

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ విలువలను కాపాడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు.

నీతి, న్యాయంతో నియామక ప్రక్రియ జరగాలి.. TGPSCకి గవర్నర్ సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ విలువలను కాపాడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు. నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ వర్క్ షాప్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్టుగా వచ్చిన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ... నీతి, న్యాయం, సామర్థ్యంతో నియామక ప్రక్రియలు జరగాలన్నారు. రెండో రోజు చట్టపరమైన పనులలో సాంకేతికతను ఏకీకృతం చేయడం, ఆల్, బ్లాక్ చైన్ ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి యంత్రాంగాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, కర్ణాటక పీఎస్సీ చైర్మన్ శివశంకరప్ప ఎస్.సహూకర్, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ సంతోష్ గోపాల్ అజ్మీరా, గోవా పీఎస్సీ చైర్మన్ డాక్టర్ ఉదయ్‌సిన్హ్ ఎస్. రావురానే, గుజరాత్ పీఎస్సీ చైర్మన్ హస్ముఖ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story