తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. గవర్నర్ చేత ప్రముఖులకు సత్కారాలు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలని రాజ్ భవన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. గవర్నర్ చేత ప్రముఖులకు సత్కారాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలని రాజ్ భవన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంబరాలు పేరిట హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న అన్ని ప్రాంతాలు రాష్ట్రాల ప్రతినిధులను ఆహ్వానించి వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలను నిర్వహించారు. ఇది “ ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్” కి చక్కని నిదర్శనం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు గవర్నర్ జిష్ణుదేవ వర్మ సత్కరించి అభినందించారు. సాహిత్యం, సాంస్కృతిక, కళా రంగానికి సంబంధించి గవర్నర్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. వీరిలో పద్మశ్రీ గడ్డం సమ్మయ్య , అంతడుపుల నాగరాజు, దాస్యం తరుణ్ భాస్కర్, హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, డా.చింతపల్లి వసుంధరా రెడ్డి, సివి అంబాజీ, డాక్టర్ మామిడి హరికృష్ణ ఉన్నారు.

Next Story