తొలిపూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి.. జోరువర్షంలోనూ బారులు తీరిన భక్తులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-27 06:14:49  IST  )

వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన మహాగణపతి (Khairatabad Maha Ganapathi) తొలిపూజలు అందుకున్నాడు. తొలుత 20 మంది సిద్ధాంతులు కలశపూజ, ప్రాణ ప్రతిష్ట నిర్వహించి..

తొలిపూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి.. జోరువర్షంలోనూ బారులు తీరిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన మహాగణపతి (Khairtabad Maha Ganapathi) తొలిపూజలు అందుకున్నాడు. తొలుత 20 మంది సిద్ధాంతులు కలశపూజ, ప్రాణ ప్రతిష్ట నిర్వహించి.. గణేషుడికి గాయత్రీ యజ్ఞోపవీతాన్ని వేశారు. అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణనాథుడికి పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ ఏడాది ఖైరతాబాద్ లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు కొలువుదీరగా.. పూజలు నిర్వహించేందుకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్‌తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఉత్సవ సమితి సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా.. ఖైరతాబాద్ బడా గణేష్ (Bada Ganesh) ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకున్నాడు. ఆయనకు ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడు సహా లక్ష్మీసమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలుచుకునే గజ్జెలమ్మ అమ్మవారిని సైతం తీర్చిదిద్దారు. జోరు వర్షంలోనూ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్లో నిల్చున్న భక్తుల్లో నిండు గర్భిణి పురిటి నొప్పులతో అక్కడే ప్రసవించడంతో అంతా దేవుడి మహిమ అంటూ .. గణపతి బప్పా మోరియా అని గణపయ్యను ప్రార్థించారు.

Next Story