- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాల్లో గవర్నర్ దంపతులు
కాళేశ్వరం(Kaleswaram)లో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో(Saraswati Pushkaralu) నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) దంపతులు పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం(Kaleswaram)లో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో(Saraswati Pushkaralu) నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) దంపతులు పాల్గొన్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పవిత్ర స్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుష్కరాలు రాష్ట్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పుష్కర ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. కాగా మే 15 నుండి మే 26 వరకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లోని కాళేశ్వరంలో జరుగుతున్నాయి.
ఈ పవిత్ర 12 రోజుల ఉత్సవంలో గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో భక్తులు పుష్కర స్నానం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం TGSRTC ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన డిజిటల్ యాప్(సరస్వతీ పుష్కరాలు 2025), స్నాన ఘట్టాలు, వైద్య సౌకర్యాలు, పార్కింగ్ వంటివి ఏర్పాటు చేసింది. కాగా ఈ పుష్కరాలు రేపటితో ముగుస్తుండటంతో కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో మహాదేవపురం-కాళేశ్వరం రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిమీల మేర వాహనాలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కు పోయాయి.






