Raj Bhavan: విద్యార్థులకు గవర్నర్ అభినందనలు

by Gantepaka Srikanth |

రాజ్ భవన్(Raj Bhavan) స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అభినందించారు.

Raj Bhavan: విద్యార్థులకు గవర్నర్ అభినందనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్(Raj Bhavan) స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అభినందించారు. సోమవారం రాజ్ భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాజ్‌భవన్ పాఠశాలలోని పదో తరగతి (SCC) టాపర్లు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సంవత్సరం జరిగిన ఎస్సెస్సీ పరీక్షల్లో పాఠశాల 97 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధికంగా 574 మార్కులు సాధించిన కుమారి హాసినితో పాటు 500 మార్కులకు పైగా సాధించిన మరో 21 మంది విద్యార్థులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావం వల్లే పాఠశాల ఈ అద్భుతమైన విద్యాపరమైన విజయాన్ని సాధించిందని కొనియాడారు. విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్, పాఠశాల అధ్యాపకులు, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.

Next Story