- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka : గిరిజన, ఆదివాసీల సంక్షేమంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ : మంత్రి సీతక్క
గిరిజన, ఆదివాసీ(Tribals And Adivasis):ల సంక్షేమం(Welfare) పట్ల రాష్ట్ర ప్రభుత్వం(Government)ప్రత్యేక దృష్టి(Special Focus) సారించిందని మంత్రి సీతక్క(Minister Seethakka)స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : గిరిజన, ఆదివాసీ(Tribals And Adivasis):ల సంక్షేమం(Welfare) పట్ల రాష్ట్ర ప్రభుత్వం(Government)ప్రత్యేక దృష్టి(Special Focus) సారించిందని మంత్రి సీతక్క(Minister Seethakka)స్పష్టం చేశారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సీతక్క నేతృత్వంలో ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు .గిరిజన, ఆదివాసీల సంక్షేమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం పోడు సమస్యలను పట్టించుకోలేదని, ఐటీడీఏలను బలహీనపరిచిందన్నారు.
ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందన్నారు. 10ఏళ్లలో ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే అశాస్త్రీయంగా అనధికారికంగా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించిందన్నారు. కులగణనను ప్రశ్నించే నైతికార్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. సమావేశంలో ఎస్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామని తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన, ఆదివాసీల అభ్యున్నతి నేపథ్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవల కోసం ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. ప్రతి గిరిజన పాఠశాలలో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవలను ఫిబ్రవరి 15 వ తేదీన ఘనంగా నిర్వహించుకుందామన్నారు.
కేసీఆర్ హయాంలో రుణమాఫీ కానీ ఎంతో మంది రైతులు తమ రుణాలను మాఫీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.






