- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ పునరుజ్జీవనానికి సర్కార్ తొలి అడుగు.. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.
తొలి విడతగా 50 ఎకరాల సేకరణ..
ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారం చెల్లించనున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే, ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. మొత్తం మూడు జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిధిలో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. మొత్తం 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో 55 కి. మీటర్ల మేర దశలవారీగా పనులు చేపట్టనున్నారు. మూసీ నది శుద్ధీకరణతో పాటు, ఇరువైపులా పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణళికలు రూపొందించింది. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.






