బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. డీజీపీకి ప్రభుత్వ విప్ లు ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అంత మంచిది కాదని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూరు వెంకట్ అన్నారు.

బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. డీజీపీకి ప్రభుత్వ విప్ లు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అంత మంచిది కాదని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూరు వెంకట్ అన్నారు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. బుధవారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వంపై కుట్ర పన్నారని, ఈ కోణంలోనూ కేసు నమోదు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేరం చేయడం ఎంతో తప్పో, దానిని ప్రోత్సహించేలా మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా అంతే నేరమని, బాల్క సుమన్ ఓ సంఘ విద్రోహ శక్తిగా మాట్లాడారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. తన రాజకీయ ఎదుగుదల, స్వార్థం కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టించారని, బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేసి జైలులో వేయాలని, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలన్నారు. రెచ్చగొట్టి మీ జీవితాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పనుతున్నారని, ప్రభుత్వం పై కుట్రకోణం విషయంలోనూ కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన, ఘటనలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయించాలని, శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం బీఆర్ఎస్ నేతలదని బల్మూరు వెంకట్ ఆరోపణలు గుప్పించారు.

బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వ విప్ లు, బల్మూర్ వెంకట్, అద్దంకి ఫిర్యాదు..

బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపైన ఆయనపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసన మండలిలో ప్రభుత్వ విప్ లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియతో మాట్లాడుతూ బాల్క సుమన్ వ్యాఖ్యలను డీజీపీ సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేయాలని, అధికారం కోల్పోయామని బల్క సుమన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టే విధంగా బాల్క సుమన్ మాట్లాడుతున్నారని, శాంతితంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆస్తులను తగలబెట్టేంచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్ వెనుక ఎవరున్నారు వారి కుట్రలు బయట పెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. బాల్క సుమన్ ను కేటీఆర్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో కేసీఆర్ మౌనంగా ఉండడం సరైన పద్ధతి కాదన్నారు.

Next Story