బీజేపీ బిడ్డలా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతున్నారు: బీర్ల అయిల‌య్య

by Vemula.Srinu Prasad |

ఆర్. కృష్ణయ్య ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల గురించి ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డం శోచ‌నీయమని, బీసీ బిడ్డలాగా కాకుండా బీజేపీ బిడ్డలా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ...

బీజేపీ బిడ్డలా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతున్నారు: బీర్ల అయిల‌య్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్. కృష్ణయ్య ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల గురించి ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డం శోచ‌నీయమని, బీసీ బిడ్డలాగా కాకుండా బీజేపీ బిడ్డలా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఆర్. కృష్ణయ్య విద్యార్థుల కోసం గ‌తంలో అనేక పోరాటాలు చేశారని, కానీ, కేసీఆర్ హ‌యంలో బ‌కాయిల‌పైన ఏనాడు ఆయన మాట్లాడలేదని బీర్ల ఐలయ్య ఆరోపించారు. సోమవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్య విద్యకు ఏం విధంగా సాయం చేస్తుందో ఆ పార్టీ నాయ‌కులు చెప్పాలని, కేంద్రం ఏం ఇచ్చిందో బీజేపీ నాయ‌కులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ లో చ‌దివే విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీల‌ను కేసీఆర్ హ‌యాంలో పెంచ‌లేదని, దాదాపు ఆరు వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు పెట్టిపోయారని బీర్ల ఐలయ్య విమర్శించారు.

తమ ప్రభుత్వ హ‌యాంలో 200% కాస్మోటిక్ ఛార్జీలు, 40 % డైట్ ఛార్జీలను పెంచామని, ఆర్. కృష్ణయ్య క‌నిపించ‌డం లేదా? అని బీర్ల ఐలయ్య నిలదీశారు. ఈ విద్యా సంవ‌త్సరం ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను ఆగ‌స్టులోనే చెల్లిస్తామ‌ని ప్రభుత్వం ప్రక‌టించిందన్నారు. 105 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 85 స్కూల్స్ కు ప‌రిపాల‌నా అనుమ‌తులు ఇచ్చామన్నారు. పేద‌ల‌కు కార్పొరేట‌ర్ విద్యను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ప్రయ‌త్నం చేస్తున్నారని, అందుకే విద్యాశాఖ‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప‌ర్యవేక్షిస్తున్నారని బీర్ల ఐలయ్య చెప్పారు. ఆగ‌స్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి నాణ్యమైన యూనిఫాం, స్కూల్ కిట్ ను అంద‌జేస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో ల‌క్ష మందికి పైగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఇది ప్రజా ప్రభుత్వం పైన ప్రజ‌ల‌కు ఉన్న విశ్వాసమని బీర్ల ఐలయ్య చెప్పారు. కేసీఆర్ హ‌యాంలో ప్రభుత్వ స్కూల్స్ ను మూసి వేసి వాడ‌కో బెల్ట్ షాపు తెరిపించారని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దుతున్నాన్నారు.

Next Story