KCR క్యాంపు ఆఫీస్‌లో CM రేవంత్ ఫొటో ఉండాల్సిందే: బల్మూర్ వెంకట్

by Gantepaka Srikanth |

గజ్వేల్ క్యాంపు కార్యాలయం సంఘటనను అడ్డంగా పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు.

KCR క్యాంపు ఆఫీస్‌లో CM రేవంత్ ఫొటో ఉండాల్సిందే: బల్మూర్ వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గజ్వేల్ క్యాంపు కార్యాలయం సంఘటనను అడ్డంగా పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రభుత్వ కార్యాల‌యం.. ప్రతి ప్రభుత్వ కార్యాల‌యంలో సీఎం ఫొటో పెట్టాల్సిందే.. గ‌జ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసు క‌ల్వకుంట్ల జాగీర్ కాదు.. కేసీఆర్ సొత్త కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు కేసీఆర్ ఫొటోలు క్యాంపు ఆఫీస్‌లలో పెట్టారు కదా? దాసోజు శ్రవణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బల్మూర్ వెంకట్ ధ్వజమెత్తారు. మా సీఎం పైన చేసిన వ్యాఖ్యలకు దాసోజు శ్రవణ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story