‘తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పుడో పోయింది’.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

‘తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పుడో పోయింది’.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) పేరిట కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోపిడీ చేసిందని ఆరోపించారు. రూ.30 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టు ప్రారంభించి ఇష్టానుసారం అంచనాలు పెంచి.. లక్ష కోట్లు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలతో తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పుడో పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగింది కాబట్టే.. అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ చేయనీయకుండా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారని విమర్శలు చేశారు. అక్రమాలకు పాల్పడటమే కాకుండా కాళేశ్వరం కమిషన్‌ను కూడా తప్పుబడుతున్నారని మండిపడ్డారు.

‘యూరియా కొరతపై కావాలనే రచ్చ చేస్తున్నారు. తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే కేంద్రం అందుకు తగ్గట్టు ఇవ్వడం లేదు. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి బీఆర్ఎస్ నేతలకు నోరు రావడం లేదు. రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయండి’ అని బీఆర్ఎస్ నేతలకు ఆది శ్రీనివాస్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై భయంతో యూరియా నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.

Next Story