- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ స్పీచ్‌కు కేసీఆర్ కుటుంబం అల్లాడిపోతోంది: ప్రభుత్వ విప్
అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్‌కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందని, పదేళ్ల తప్పులను అసెంబ్లీ వేదికగా తూర్పార పట్టడంతో కేటీఆర్, హరీష్ రావు తల్లడిల్లిపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్‌కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందని, పదేళ్ల తప్పులను అసెంబ్లీ వేదికగా తూర్పార పట్టడంతో కేటీఆర్, హరీష్ రావు తల్లడిల్లిపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ చాంపియన్స్‌గా చెప్పుకొని తిరుగుతున్న కల్వకుంట్ల కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో ఎండగట్టడంతో ఆగం ఆగం అవుతున్నారని, కేటీఆర్ అసహనం పీక్స్‌కు పోయిందని మండిపడ్డారు. ఆదివారం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిని ఉరి తీయాలని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదని అన్నారు.
కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదు
కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదు.. కోరుకోడు కూడా.. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరి తీసినా తప్పు లేదని మాత్రమే అన్నారు. ఆ తీవ్రతను చెప్పే ప్రయత్నం చేశారు తప్ప చావు గురించి మాట్లాడలేదని ఆది శ్రీనివాస్ వివరించారు. కేసీఆర్ కిందపడినప్పుడు మొదట పరామర్శించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నది కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.






