- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖ లో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు

రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుంది
అందులో భాగంగా రవాణ శాఖలో పలు కీలక పోస్టులు భర్తీ
పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందిన ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పెరేడ్ లో మంత్రి పొన్నం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖ లో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే 113 అసిస్టెంట్మోటార్వెహికల్ఇన్స్ స్పెక్టర్పోస్టులు,54 రవాణా కానిస్టేబులు పోస్టులు ,10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆర్ బీవీఆర్ఆర్తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన ఏఎంవీఐ ల పాసింగ్ఔట్పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్బంగా మాట్లాడుతూ నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు సమాజంలో గౌరవ ప్రదంగా ఉన్నత స్థితిలో ఉన్నారని, విధులు సక్రమంగా నిర్వహించిన మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
రాజ్ బహుదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉందని, మీరంతా ఇక్కడ శిక్షణ పొందడం ఎంతో గర్వకారణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిందని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందని, పోలీస్ అకాడమీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎఎంవీఐలు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తమ శక్తి ఉపయోగించి మరణాల రేటు తగ్గించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై ఎన్ ఫోన్పోర్స్మెంటు కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఏఐ తీసుకొచ్చి వాహనాల ఫిట్ నెస్పరీక్షలు చేయబోతున్నట్లు వెల్లడించారు.
చట్టాల గురించి, న్యాయ సంహిత కోడ్ ల గురించి వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఈవీ, సీఎన్జి, ఎల్పీసీ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో రవాణా శాఖ లో నియామకం అవుతున్న వారందరికీ మీరంతా రోల్ మోడల్ గా ఉండాలన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని విధంగా మంచి పేరు తెచ్చుకుంటూ పని చేయాలని, మీరంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతుల బిడ్డలు కావడం హర్షనీయమన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తి ,రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ , జేటీసిలు ,రవాణా శాఖ అధికారులు ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






