- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో 21 మంది కన్ఫర్డ్ ఐఏఎస్‌లు.. డీవోపీటీకి సర్కార్ ప్రతిపాదనలు
రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందనున్నారు. ఒకే సారి 21 మంది అధికారులు స్టేట్ సర్వీసు కేడర్(ఎస్సీఎస్), నాన్ స్టేట్ సర్వీసు కేడర్ (నాన్ ఎస్సీఎస్) లుగా కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా గుర్తింపు పొందనున్నారు. రాష్ట్రంలో 2022 సంవత్సరానికి సంబంధించి 14 పోస్టులు, 2023 సంవత్సరానికి మూడు పోస్టులు, 2024 సంవత్సరానికి నాలుగు కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్ల చొప్పున డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) కి ప్రభుత్వం పంపింది.
గతంలో కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ఎంపికకు యూపీఎస్సీ అధికారులు డీవోపీటీ పంపించిన జాబితాతో ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసే వారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఇంటర్వ్యూల విధానాన్ని ఎత్తివేశారు. దీంతో డీవోపీటీకి పంపించిన మూడు పేర్లలో ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేస్తారు. సర్వీసు రిజిస్ట్రర్, వారి ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను, ఆరోపణలు, ఫిర్యాదులు తదితర వాటన్నంటినీ పరిశీలించి ఎంపిక చేసే అవకాశాలున్నాయని సమాచారం. కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఎంపిక కావడానికి కొందరు అధికారులు తమకు తెలిసిన ప్రముఖులు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
నాలుగు ఐపీఎస్‌లు..
కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటుగా కన్ఫర్డ్ ఐపీఎస్‌లకు నాలుగు పోస్టులకు ఎంపిక చేయనున్నారు. నలుగురి కోసం ఒక్కో పోస్టుకు మూడు పేర్లను పంపించారు. వీరిలో శ్రీనివాస్, శ్రీబాల, సునీతా రెడ్డి, గుణశేఖర్, రవీందర్, సమెయ్జాన్ రావు తదితరులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరి పేర్లు పంపించడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.






