మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు.. మేటి పారిశ్రామికవేత్తలతో పోటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 01:20:31  IST  )

తెలంగాణ మహిళలు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు.. మేటి పారిశ్రామికవేత్తలతో పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మహిళలు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో వివిధ పథకాలు.. అభ్యుదయ విధానాలను అమలు చేసింది. రెండేండ్లలోనే మహిళల సాధికారిత దిశగా దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. మహిళా స్వావలంబనతో పాటు మహిళల రక్షణ, ఆర్థిక భద్రతకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మీ పేరుతో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించారు. రెండేండ్లుగా ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మహిళల ఆదరణను చూరగొంది. రోజూ లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు చదువుల కోసం, పనుల మీద బస్సులో ఉచితంగా జీరో టికెట్ పై ప్రయాణం చేస్తున్నారు. చార్జీలపై ఆదా చేసుకున్న సొమ్మును ఇతర ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు రూ. 7600 కోట్లు ఆదా చేసుకున్నారు. రోజుకు దాదాపు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లపై ప్రయాణిస్తున్నారు.

45 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్

రెండో ప్రాధాన్యతగా ఇంటి ఆడబిడ్డలకు ఖర్చు తగ్గించే ఉద్దేశ్యంతో సబ్సిడీపై రూ.500లకే గ్యాస్ సిలెండర్ ను ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇందిరా మహిళాశక్తి స్కీమ్ ద్వారా స్వయంకృషితో ఎదిగే మహిళలకు రుణాలు అందించటం ద్వారా స్వయం సహాయక గ్రూపులు ఆర్థికంగా తమకాళ్ల మీద తామే నిలబడేలా సర్కారు సహకారం అందిస్తోంది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా నేడు తెలంగాణ మహిళలు సొంతంగా ఆర్టీసీకే బస్సులను అద్దెకివ్వటంతో పాటు, తామే పెట్రోల్ బంకులను కూడా నడిపే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. మహిళల భద్రత కోసం టీ సేఫ్ లాంటి సౌకర్యాలను ఈ రెండేళ్లలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు నమ్ముకున్న ప్రభుత్వం తెచ్చింది.

కోటి మంది మహిళలు కోటీశ్వరులే లక్ష్యం

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి మిషన్‌ 2025 పాలసీని అమల్లోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణ మహిళలు, యువతులను ఒకే గొడుగు కిందకు తెచ్చి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే లక్ష్యంతో వినూత్న నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు ఇందిరా మహిళా శక్తి సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలో, పట్టణాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో ఉన్నాయి. వేర్వేరు సంస్థల పరిధిలో ఉండటంతో ఉమ్మడి పథకాల అమలుకు ఇబ్బందులున్నాయని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లోని సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు పట్టణాలకు వలస వచ్చినప్పుడు వారికి పథకాలు అందడం లేదు. మరోవైపు చాలా గ్రామాలు పక్కన ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో విలీనమయ్యాయి. ఇప్పటికే సెర్ప్‌ పరిధిలోని 33,914 సంఘాలు మెప్మా పరిధిలోకి వెళ్లాయి. అందుకే మెప్మా వేరు.. సెర్ప్ వేరుగా కాకుండా.. సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ప్రజా ప్రభుత్వం కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలన్నీ అన్ని ప్రాంతాల మహిళలకు సమానంగా అందించింది. మెప్మా, సెర్ప్‌ విలీన ప్రక్రియ చేపట్టిన తర్వాత కొత్త సభ్యులతో మహిళా సంఘాల సభ్యుల సంఖ్య కోటికి చేరాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. కోటి మంది మహిళలు రూ.లక్ష కోట్ల రుణాన్ని పొందినప్పుడు నిజమైన మహిళా సాధికారత సిద్ధిస్తుందని సంకల్పించింది.

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన

మహిళల సాధికారత, స్వాలంబనకు ఈ రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమాలు అమలు చేసింది. తె లంగాణ మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.26 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలు రూ.4825 కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సెక్రెటేరియట్ తో పాటు జిల్లా కలెక్టరేట్లు, ప్ర భుత్వ ఆఫీసులు, కోర్టులు, కాలేజీలు, హాస్పి ట ళ్లు, ఆలయాలు, టూరిస్టు ప్రాంతాలు న్యాయస్థా నాలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయా లు, పర్యాటక ప్రదేశాల్లో 214 ఇందిరా మహి ళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. హైద రాబాద్‌లోని ఐటీహబ్‌ మాదాపూర్‌లో మ హిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేసింది. రూ.9 కోట్లతో 106 దుకాణాల సముదాయాన్ని నిర్మిం చి, సంఘాలకు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే పనులను ప్రభుత్వం ఈ సంఘాలకు అప్పగించింది. ఈ కుట్టుకూలీ ఛార్జీలతో రూ.30 కోట్ల ఆదాయం సంఘాలకు సమకూరింది. పాఠశాలల నిర్వహ ణ, నిర్మాణ పనులను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించింది. ఈ కమిటీలకు రూ. 554 కోట్ల విలువైన పనులు అప్పగించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజ న కింద మత్స్యశాఖ ద్వారా 32 జిల్లాల్లో మొబై ల్ ఫిష్ అవుట్ లెట్లను ప్రారంభించింది. రూ.10 లక్షల విలువైన వాహనాలను 60 శా తం సబ్సిడీతో అందజేసింది. ప్రమాదానికి గురై న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమాను అందించింది. కొన్ని కుటుంబాలకు రూ.2 లక్షల రుణబీమాను చెల్లించింది. పారిశ్రా మికవేత్తలతో పోటీపడేలా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలతో పెట్రోలు బంక్‌లను ఏర్పాటు చే యించింది. నారాయణపేట. సంగారెడ్డిలో జిల్లా సమాఖ్యలు పెట్రోలు బంక్‌లు నిర్వహించి లాభాల బాటలో నడుస్తున్నాయి.

మహిళా సంఘాల‌తో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు

దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. మహిళా సమాఖ్యల వద్ద ఉన్న రూ.54 కోట్లతో 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే 17 జిల్లాల్లో సమాఖ్యల అధ్వర్యంలో 151 బస్సులను కొన్నారు. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వ టంతో మహిళా సంఘాలు బస్సులకు ఓనర్లయ్యారు. ఆర్థిక సాధికారత కోసం మరో 449 బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరా జయంతి నవంబర్ 19న ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కా ర్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కోటి చీరలు మొ దటి దశలో 65 లక్షల గ్రామీణ మహిళలకు పంపిణి చేయాలని, రెండో దశ లో మార్చి నెలలో పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story