సర్వీస్ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు

by Gantepaka Srikanth |

ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల కోసం ఒక ప్రధాన వంతెన నిర్మాణం, ఎగ్జిట్ నం. 18A ఇంటర్‌చేంజ్ నుండి మూసీ నది వెంబడి నార్సింగి రింగ్ వరకు కొత్త సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.229కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

సర్వీస్ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల కోసం ఒక ప్రధాన వంతెన నిర్మాణం, ఎగ్జిట్ నం. 18A ఇంటర్‌చేంజ్ నుండి మూసీ నది వెంబడి నార్సింగి రింగ్ వరకు కొత్త సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.229కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పనులను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) ఆధ్వర్యంలో ఈ-ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా ఈపీసీ విధానంలోగానీ లేదా బీఓక్యూ విధానంలో గానీ టెండర్లను ఆహ్వానించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిదులను హెచ్ఎండీఏ నుంచి భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

హైలెవల్ బ్రిడ్జీ కోసం రూ.18.50 కోట్లు..

యాదాద్రి-భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, బీబీనగర్‌లోని మూసీ నదిపై రుద్రవెల్లి-జూలూరు వద్ద ఉన్న హై-లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను చేపట్టడానికి, ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌పై సక్రమంగా టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రూ.18.50 కోట్లకు పరిపాలనా అనుమతిని మంజూరు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఎఫ్సీడీఏకు రూ.150కోట్లు..

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) పరిధిలోని మౌలిక సదుపాయాలైన రోడ్ల విస్తరణ మరియు బలోపేతం, కల్వర్టుల నిర్మాణం, జలవనరుల పునరుద్ధరణ మరియు వాటికి అనుబంధంగా అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.150కోట్లుకు పరిపాలన మంజూరు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 2026-27 బడ్జెట్ కేటాయింపులో భాగంగా ఈ నిధులు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిధులు మంజూరు చేయాలని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) నుండి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Next Story