- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం : మంత్రి ఉత్తమ్
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రబీ సీజన్ లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. గత పాలనలోని 2022-23 రబీ సీజన్ లో మే 22 నాటికి కేవలం 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కేసీఆర్ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చి చూస్తే ఈ ప్రభుత్వం రబీలో మే 22 నాటికి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసిందన్నారు.
ఈ గణాంకాలే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి నిదర్శనమని, చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా తేల్చి చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్ ఇటు రబీ లోనూ రికార్డు స్థాయిలో ధాన్యాం దిగుబడి వచ్చిందన్నారు. అత్యధికంగా దిగుబడి వస్తుందని ముందు చూపుతో కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని తెలిపారు.






