Gulf Workers: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ ఆర్థిక భరోసా.. ఎంతో తెలుసా?

by Ramesh Naini |

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చోరవ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Gulf Workers: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ ఆర్థిక భరోసా.. ఎంతో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Gulf workers)గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రత్యేక చోరవ తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మృతి చెందినవారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధిత అధికారులకు (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.

రూ.5 లక్షల చొప్పున.. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా ఎక్స్‌గ్రేషియా అంశాన్ని సీఎం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్ ఈరవత్రి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు.

Next Story