నాలుగు గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్​

by Malleboina Mahesh |

వంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 అత్యాధునిక గోశాలల ఏర్పాటు.. ఎనికపల్లిలో రూ.157 కోట్లతో మోడల్ గోశాల, వేములవాడలో 100 ఎకరాలు కేటాయింపు!

నాలుగు గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గోశాల పాలసీ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, నాలుగు గోశాలలు ఏర్పాటుకు ప్లాన్ ​చేస్తుందని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్​సింగం కౌశిక్​చరణ్ ​తెలిపారు. ఎనికపల్లి 99 ఎకరాలలో రూ. 157 కోట్లుతో, ,వేములవాడలో 100 ఎకరాల్లో, యాదగిరి గుట్ట తో పాటు వెటర్నరీ యూనివర్సిటీ లో ఏర్పాట్లు వేగం జరుగుతున్నట్లు చెప్పారు. మంగళవారం తమ కార్యాలయంలో తెలంగాణ గోశాల సేవ సమితి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 2216 కోట్లతో రాష్ట్రంలో దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుందని రూ.1000 కోట్లతో గోదావరి పుష్కరాలకు కేటాయించి హిందూ సనాతన ధర్మాన్ని ప్రజల విశ్వాసాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేస్తుందని వెల్లడించారు. సమావేశానికి హాజరై వక్తలు మాట్లాడుతూ గోశాల కోసం ప్రత్యేక తక్షణమే ఏర్పాటు చేయడంతో పాటు ప్రకృతి వైద్యాన్ని పెంపొందించాలని సూచించారు. గోమాత ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గోవును తెలంగాణ కల్చరల్ యానిమల్ గా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి, సీఈఓ సుబ్బారాయుడు, తెలంగాణ గోశాల సేవా సమితి అధ్యక్షులు విజయ రామ్, కార్యదర్శి బాలకృష్ణ గౌడ్, కోశాధికారి ధనుంజయ్ పాల్గొన్నారు.

Next Story