- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్‌అండ్‌బీలో ప్రమోషన్ల పండుగ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)లో ప్రమోషన్ల పండుగ వాతావరణం నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: (Roads & Buildings Department Government Of Telangana) తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)లో (Promotions) ప్రమోషన్ల పండుగ వాతావరణం నెలకొంది. ఒక్కరోజే 64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్లతో పాటు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు ఎఫ్ఏసీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్అండ్‌బీ (R&B) బలోపేతంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) దృష్టి సారించారు. మంత్రి ఆదేశాలతోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు పొందిన అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






