ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు !

by velandi.Saikiran |

డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు... ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ఈ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్ రావుల‌ను పిలిచి విచార‌ణ చేసిన స‌ర్కార్‌, ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది సర్కార్.

డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు... ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు.. విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Next Story