వలపు వల విసిరింది.. దెబ్బకు రూ. 5 లక్షలు సమర్పించుకున్న ప్రభుత్వ ఉద్యోగి

by Dishafeatures2 |
వలపు వల విసిరింది.. దెబ్బకు రూ. 5 లక్షలు సమర్పించుకున్న ప్రభుత్వ ఉద్యోగి
X

దిశ, వెబ్ డెస్క్: ఫేస్ బుక్ లోకి లైవ్ లోకి వచ్చిన ఓ అందమైన యువతి హాయ్ అని మెసేజ్ పెట్టింది. దీంతో ఎగిరి గంతేశాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వెంటనే ''చాలా అందంగా ఉన్నావ్ నువ్వంటే నాకు ఇష్టం'' అన్నాడు. ఇంకేముంది ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. చాటింగ్ వ్యవహారం ఫేస్ బుక్ నుంచి వాట్సాప్ కు మారింది. వీడియో కాలింగ్ లో మాట్లాడుతూ అందాన్ని అతడికి వలగా విసిరిందా యువతి. ముసిముసిగా నవ్వుతూ ''నిన్ను అలా చూడాలని ఉంది'' అని ఆ యువకుడితో చెప్పింది. ఏమాత్రం లేట్ చేయకుండా ఆమె చెప్పినట్లు ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడు ఆ యువకుడు.

కట్ చేస్తే.. తరువాతి రోజు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వకుంటే 'నీ నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా' అంటూ ఆ యువతి అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. అప్పుడు గానీ అర్థం కాలేదు ఆ వ్యక్తికి తాను మోసపోయానని. వీడియో బయటకు పోతే పరువు పోతుందనే భయంతో అడిగినంతా అప్పజెప్పాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed