Rythu Bharosa : రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by Rajesh |
Rythu Bharosa : రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
X

దిశ : తెలంగాణ బ్యూరో : గోదావరి నదిలో ఫ్లడ్ లేదని, కానీ ప్రాణహిత లో వరద ఎక్కువగా వస్తున్నదని దీంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన శాసన మండలిలో మాట్లాడారు. గత ప్రభుత్వం బ్యారేజ్‌లు సక్రమంగా నిర్మించలేదని, అందుకే వివిధ ప్రాజెక్టులలో నీరు వృథా అవుతుందన్నారు. ఇష్టారీతిలో ప్రాజెక్టులకు రీ డిజైన్ లు చేసి, అస్తవ్యస్తంగా మార్చేశారన్నారు. దీంతోనే ఇప్పుడు రైతులకు కష్టాలు వస్తున్నాయన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజ్ లూ సక్రమంగా నిర్మించక పోవడం వలన నీళ్ళు వృథాగా పోతున్నాయన్నారు.

కానీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. రైతు భరోసాపై గైడ్ లైన్స్ ఎలా ఉండాలనేది రెండు సభలలో చర్చిస్తామన్నారు. మరోవైపు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరికీ అన్యాయం జరగదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 26 వేల కోట్లు నిధులు వృథా అయ్యాయన్నారు. ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామన్నారు. మండలిలోని వివిధ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రిపై విధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed