- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారుల హామీలు నెరవేర్చడానికి త్వరలో కమిటీ: పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజా పాలన ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు (Telangana Activists) ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి త్వరలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్‍తో కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిటీకి సంబంధించిన విధి విధానాలు ఉద్యమకారుల హామీలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరాం, ఉద్యమకారులు చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం కాబోతున్నారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో:
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పథకం కింద ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు సుమారు రూ.25వేల పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు కల్పించాలన్న హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు గత సోమవారం విచారణ జరిపింది. అభయహస్తం పథకం (Abhaya Hastham Scheme) కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులకు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని థర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హతల పరిశీలనలో ఆలస్యం చేయకుండా, విధివిధానాల ప్రకారం కేసులను పరిష్కరించి ప్రయోజనాలు అందించాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తాజాగా మంత్రి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.






