- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tummala Nageswara Rao : మతికెపల్లిలో మార్కెట్ యార్డుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మంలో మరో మార్కెట్ యార్డు(Market Yard) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం(Khammam)లోని మతికెపల్లి(Mathikepalli)లో వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రభుత్వ అనుమతి లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ప్రకటించారు. ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు లేనందున రైతులు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలను రైతులు పెద్ద మొత్తంలో దళారులకు అమ్ముకొని, తీవ్రంగా నష్టపోయే వారని తుమ్మల పేర్కొన్నారు. అందువల్ల ప్రత్యేక చొరవ తీసుకొని మతికెపల్లిలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇకపై రైతులు వారి అన్ని రకాల పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చని, వారి శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
Next Story






