- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ(Telangana)లోని ఉపాధి హామీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని ఉపాధి హామీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ పథకం (MGNREGA)లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల బకాయి వేతనాలు(Pending Salaries) విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు మొత్తం 3,200 మందికి చెందిన రూ.62 కోట్ల వేతన బకాయిలు మంగళవారం విడుదల అయ్యాయి. అయితే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే తమ జీతాలు విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా వీరంతా నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన సర్కార్ నేడు ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.
Next Story






