- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ కార్పొరేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
హైదరాబాద్ కార్పొరేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలోని కార్పొరేటర్ల(Hyderabad Corporators)కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో డివిజన్‌కు రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధికారికంగా ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లకు రూ.300 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కాగా, ఇవాళ మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. నగర అభివృద్ధిపై చర్చించారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు సభలో రభస జరిగింది. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేమాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ నినాదాలు చేశారు. దాంతో బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మరోవైపు పలు అంశాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి నిరసన తెలిపారు.






