- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ భాగం RRR కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపడుతున్న దక్షణ భాగం త్రిబుల్ ఆర్ (ప్రాంతీయ రింగ్ రోడ్) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపడుతున్న దక్షణ భాగం త్రిబుల్ ఆర్ (ప్రాంతీయ రింగ్ రోడ్) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చౌటుప్పల్ లో ఏర్పాటు చేయనున్న ఉత్తర భాగం త్రిబుల్ ఆర్ సర్కిల్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఆమన్ గల్, షాబాద్, కొందుర్గు, వికారాబాద్ జిల్లా పూడూర్, నవాబుపేట, సంగారెడ్డి జిల్లా కొండాపూర్, సదాశివపేట మండలం పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జెక్షన్ (సర్కిల్) వరకు దాదాపు 201 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు తాజాగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 2010 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రూ.18 వేల కోట్లతో దక్షణ భాగం రీజనల్ రింగ్ రోడ్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 189.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. తదుపరి అనుమతులు లేకపోవడంతో రహదారి అలైన్ మెంట్, భూసేకరణ పనులు నిలిచిపోయాయి.
ఈ ప్రాజెక్ట్ కు సోమవారం క్యాబినెట్ ఆమోందిచడంతో పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వంలో 189.5 కిలోమీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేల సూచనల మేరకు ఈ రహదారి 201 కిలోమీటరులకు పెరిగింది. మొదట్లో ప్రతిపాదించిన అలైన్ మెంట్ లో మార్పులు చేయడంతో త్రిబుల్ ఆర్ పొడుగు 189.5 కిలోమీటర్ల నుంచి 201 కిలోమీటరుకు పెరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. చౌటుప్పల్ సర్కిల్ నుంచి మొదలు పెట్టనున్న ఈ రహదారి మొదట్లో మాల్ లోపలి నుంచి ప్రతిపాదించారు. ప్రభుత్వం సూచనల మేరకు పాత అలైన్ మెంట్ ను సవరించినట్లు సమాచారం. అలాగే కొందర్గు మండలంలో కూడా పాత అలైన్ మెంట్ ను మార్చినట్లు కొత్తగా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని సూచన మేరకు ఈ రహదారిని సవరించినట్లు తెలిసింది.
దీంతో మాడ్గుల, తలకొండపల్లి, పూడూర్ మండలాల్లో చేపట్టిన మార్పులతో దాదాపు 20 కిలోమీటర్లు పోడువు దక్షణ భాగం త్రిబుల్ ఆర్ పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. దక్షణ భాగం త్రిబుల్ ఆర్ కు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో ఈ రహదారి నిర్మాణంకు సంబంధించిన అలైన్ మెంట్, రోడ్డు మార్కింగ్, భూసేకరణ తదితర పనులను ఇక మొదలు పెట్టనున్నారు. తాజా ప్రతిపాదించిన మార్గంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, కొన్ని నిర్మాణాలు మాత్రమే రోడ్డు నిర్మాణంలో పోతున్నాయి. ముఖ్యంగా దక్షణ భాగం త్రిబుల్ ఆర్ కు అటవీ భూముల అండంకులు లేకపోవడంతో దీని నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూసేకరణ సులభంగా, పనులు వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మొదటి ప్రతిపాదన ఇది
చౌటుప్పల్లో ఏర్పాటు చేయనున్న ఉత్తర భాగం త్రిబుల్ ఆర్ సర్కిల్ నుంచి తలకొండపల్లి, ఆమన్ గల్, షాబాద్, కొందుర్గు, పూడూర్, నవాబుపేట, కొండాపూర్ మండలం, సదాశివపేట మండలం పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జెక్షన్ (సర్కిల్) వరకు దాదాపు 189.5 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు మొదట ప్రతిపాదించారు. పూడూర్ మండలం కౌకుంట్ల, అంగడ్ చిట్టెంపల్లి , రేగడి మామిడిపల్లి గ్రామాల పరిధిలో మీదుగా ప్రతిపాదించారు. కొందుర్గు మండలం రాంచంద్రాపురం, రేగడిచిలకమార్రి, బైరంపల్లి మీదుగా ఉండేది.
* తాజాగా మాడ్గుల మండల నల్ల చెరువు, కుర్మేడు, ఆమన్ గల్ మండలం చింతల పల్లి, మెడిగడ్డతండా, పోలెపల్లి, తలకొండపల్లి మండలం కానాపూర్, షాబాద్ మండలం మీదుగా కొందుర్గు మండలంలోని వనంపల్లి, లాల్పపాహాడ్, తుర్కఎన్కెపల్లి, పూడూర్ మండలం కంకల్, పెద్ద ఉమ్మెంతల, కొత్తపల్లి, మీర్జాపూర్, వికారాబాద్ మండలం సిద్దులూరు, నవాబుపేట మండలం పూలపల్లి, పుల్ మామిడి, ఎల్కకొండ, కొండాపూర్, సదాశిపేట మండలాల మీదుగా పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జెక్షన్ (సర్కిల్) వరకు నిర్మించనున్నారు.
- Tags
- RRR






