TG News : టీచర్ల సర్దుబాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-30 15:37:21  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TG News : టీచర్ల సర్దుబాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు(Teachers Adjustment) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు బదిలీ చేసేందుకు జిల్లా కలెక్టర్ల(Collectors)కు అధికారం ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరు జిల్లా విద్యాశాఖ అధికారుల(DEO)తో కలిసి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయులు పనిచేస్తున్న జిల్లాల్లో మాత్రమే నిర్వహించేలా అనుమతించింది.

అనగా మండలాల వారీగా సర్ప్లస్ ఉపాధ్యాయులను గుర్తించి, సమీప మండలాల్లోని అవసరమైన పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఒక్కో స్కూల్‌కు కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు పేర్కొన్నారు.

Next Story