- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెల్లో జోరుగా ఉపాధి హామీ పనులు.. 8 కోట్ల పనిదినాల లక్ష్యంపై ప్రభుత్వం ఫోకస్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. మంత్రి సీతక్క వరుస సమీక్షలతో కూలీల హాజరు శాతం పెరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలతో పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 16 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. మే మొదటి వారంలో కూలీల హాజరు 7 లక్షలు ఉండగా ప్రస్తుతం 16.24 లక్షలకు చేరింది. పెండింగ్ బకాయిల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేశారు. జూలై 1 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. దీన్ని కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన 8 కోట్ల పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోంది.






