- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్కింగ్ జర్నలిస్టులకు సర్కారు ఆర్థిక సహాయం
వర్కింగ్ జర్నలిస్టులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మరణించిన 18 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఝకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఏడుగురు జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : వర్కింగ్ జర్నలిస్టులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మరణించిన 18 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఝకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఏడుగురు జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ ఆర్థిక సహాయం మంజూరు చేసింది. వీరికి ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం, అలాగే ఆయా కుటుంబాలకు ఈ ఆగష్టు నుంచి ప్రతి నెలా మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందచేయనున్నారు.
అలాగే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్.కే.జి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును మంజూరు చేయనున్నారు. రోడ్డు ప్రమాదం, రైలు ప్రమాదం కారణంగా శాశ్వతంగా అంగవైకల్యం పాలైనవారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు, బ్రైయిన్ హేమరేజ్, బ్రైన్ ట్యూమర్ వ్యాధి గ్రస్తులు, పని చేయలేని స్థితిలో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయము, మరోకరికి 50 వేల రూపాయల చొప్పున జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయనున్నారు.






