స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నజర్.. కాసేపట్లో ప్రజాభవన్ లో కీలక భేటీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-24 11:51:18  IST  )

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.

స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నజర్.. కాసేపట్లో ప్రజాభవన్ లో కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్:తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 26 నాటికి తమ నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అడ్వకేట్ జనరల్‌ను కూడా ఆహ్వానించారు. తద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకోనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ఆగస్టు 29న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story