HYD: ఆ ప్రాంతాన్ని అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రభుత్వం

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-13 12:17:43  IST  )

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది.

HYD: ఆ ప్రాంతాన్ని అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరో భారీ అర్బన్ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 424.31 ఎకరాల అటవీ భూభాగాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర శివార్లలోని అటవీ భూములను సంరక్షిస్తూ, వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పర్యావరణానికి పెద్దపీట :

వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ అర్బన్ పార్కులు 'గ్రీన్ లంగ్స్' (పచ్చని ఊపిరితిత్తులు)గా పనిచేస్తాయి. గతంలో గండిపేట, కోత్వాలగూడ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కులకు వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు నిర్మించబోయే పార్కులో మరిన్ని అత్యాధునిక వసతులు, బయో-డైవర్సిటీ పాయింట్లు ఉండేలా అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వే మరియు ఫెన్సింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Next Story