ఆర్టీసీ సమ్మె నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రలు: కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్

by Ramesh Naini |

రేవంత్ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని మార్చుకోవాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ సూచించారు.

ఆర్టీసీ సమ్మె నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రలు: కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని మార్చుకోవాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ సూచించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పై ఇష్టమొచ్చిన రీతిలో వాగారని.. సీఎం రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని.. ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఐదు వాగ్దానాలు చేసిందని.. వాటిపైనే సమ్మె ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని.. రెండు సార్లు చర్చలు జరిగినా ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొన లేదని ఆరోపించారు.

సీఎంకు, మంత్రులకు ఆర్టీసీ సంఘాలు డిమాండ్లపై విడమరిచి చెప్పినా పట్టించుకోలేదన్నారు. పైగా సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఆర్టీసీ బస్సులకు నైపుణ్యం లేని డ్రైవర్లను తాత్కాలికంగా నియమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తాండూరులో పోలీసులు జారీ చేసిన హెచ్చరిక దుర్మార్గంగా ఉన్నదని చెప్పారు. సీఎం జిల్లాలో పోలీసులు ఎమెర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారని అన్నారు. సమ్మెపై బీజేపీ గోడ మీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు.

Next Story