- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinivas Goud : నీరా కేఫ్ పై ప్రభుత్వం కుట్ర : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ మంత్రిగా గౌడ కులస్తులు...గీత కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ హుస్సెన్ సాగర్ తీరానా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ధ 20కోట్లతో ఆధునిక వసతులతో నిర్మించిన నీరా కేఫ్(Neera Cafe) ను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తొలగించే(Removal) కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ మంత్రిగా గౌడ కులస్తులు...గీత కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ హుస్సెన్ సాగర్ తీరానా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ధ 20కోట్లతో ఆధునిక వసతులతో నిర్మించిన నీరా కేఫ్(Neera Cafe) ను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తొలగించే(Removal) కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు.
ఆదివారం ఆయన నీరా కేఫ్ ను సందర్శించి..దాని నిర్వాహణను పట్టించుకోని ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నీరా కేఫ్ ను తొలగించి హోటల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నీరా కేఫ్ పేరుతో ఉన్న బోర్డులన్నీ నిర్వాహకులు ఇప్పటికే తొలగించారని శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. నగరం నడి గడ్డపై గౌడన్నల కోసం కేసీఆర్ తీర్చిదిద్దిన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు.. కేఫ్‌ను పూర్తిగా అన్యాక్రాంతం చేసేందుకు ఆదేశాలను సైతం టూరిజం శాఖ సిద్ధం చేసినట్టుగా ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీరా కేఫ్ కు నగర శివారులోని నందన వనంలోని పదేకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి, ఈత చెట్ల నుంచి నీరా సేకరించి నాలుగు డిగ్రీల వద్ధ నిల్వ చేసి..దాన్ని సీసాల్లో పోసీ ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొచ్చి నీరా కేఫ్ లో శుద్ధి చేసి ఫ్యాకింగ్ చేసి విక్రయించేవారు. తాటిచెట్లు, ఈతచెట్ల మధ్య కూర్చుని కల్లు సేవించే అనుభూతి కలిగేలా నీరా కేఫ్ డిజైన్ చేశారు.
రెస్టారెంట్ తరహాలో నీరా కేఫ్ ను నిర్మించారు. అల్కాహాల్ రహిత తియ్యటి నీరాతో పాటు ఫుడ్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం టూరిజం శాక నీరా కేఫ్‌ను తీసేసి, హోటల్ గా మార్చి కాంట్రాక్టు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.






