- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిటీలో ఒక్క మహిళా లేకపోవడం అవమానించడమే: కవిత
జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన సమస్త మహిళలను అవమానించడమేనన్నారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన భూ పోరాటాలు, ఉద్యమాలకు దిగివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీని ఏర్పాటు చేసిందని అయితే కమిటీలతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియ ఈ ఏడాది జూన్ 2వ తేదీన ప్రారంభం కాకుంటే ఉద్యమకారులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ:
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కె.కేశవరావు ఛైర్మన్‌గా నియమించగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఉద్యమకారులను గుర్తించి, వారిని గౌరవించడానికి సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ - 679 ను జారీ చేసింది.






